పండ్ల తోటల పెంపకంపై అవగాహన..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు , బ్రాహ్మణకొట్కూరు గ్రామాల లోని పండ్ల తోటల పెంపకంపై జలసిరి గుర్రం చిన్న స్వాములు అవగాహన కల్పించడం జరిగింది.5 ఏకరాల లోపు చిన్న సన్నకారు రైతులు అర్హులు అని ఉపాధి హామీ పథకం ద్వారా చీనీ,మామిడి, సపోటా,డ్రాగన్,దానిమ్మ, నేరేడు ఇంకా ఇతర పండ్ల మొక్కలు ఉన్నాయని తెలిపారు.పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ మొక్కలు నాటుకున్న అంతర్ పంటలు వేసుకోవచ్చు అని తెలపడం జరిగింది ఉపాధి ఏపీఓ అలివేలు మంగమ్మ మాట్లాడుతూ మొక్కలు కావలానికున్న రైతులు పట్టాదారు పాసు బుక్ ఆధార్ పన్ కార్డు తీసుకొని గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గానీ సంభదిత ఉపాధి కార్యాలయంలో ఇవ్వగలరు అని తెలుపడం జరిగింది.మొక్కలను మీరు సంరక్షించు కున్నందుకు గాను నగదును మీ అకౌంట్ లో జమ అవుతుందని ఏపిఓ రైతులకు తెలిపారు.ఈకార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు కవిత,ఉమేష్,ఎఫ్ఏ లు శ్రీను, వలి మరియు రెండు గ్రామ రైతులు పాల్గొన్నారు.