అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించిన కోలా ప్రతాప్ సన్మానం
1 min readబొల్లవరం రామాంజనేయులు అధ్యక్షులు
అంతర్జాతీయ పతక విజేత కరాటే ప్రతాప్ కు సన్మానం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఏపీ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కోలా ప్రతాప్ అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మెడల్ సాధించుకుని సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు శాలువా, దండతో సత్కరించారు. కోలా ప్రతాప్ సింగపూర్ లో జరిగిన ఏషియా ఫెసిఫిక్ సిటిరియా మాస్టర్స్ 45 -47 విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు.స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం హాలులో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో జిల్లా కరాటే సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు క్రీడా సంఘ నేతలు క్రీడాకారులు పాల్గొని కోలా ప్రతాప్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రామాంజనేయులు, క్రీడా సంఘ ప్రతినిధులు కేఎండి షకిల్ నబి సాహెబ్, ఆరిఫ్ హుస్సేన్, చిన్న సుంకన్న, , విజయ్ కుమార్, ఇంద్ర ఫయాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.