మాజీ సీఎం జగన్ ను కలిసిన కొల్లేరు నేత రామరాజు
1 min readజగన్ హయాంలోనే కొల్లేరు అభివృద్ధి
ఆయన ప్రవేశ పెట్టిన నాడు – నేడు పథకం ప్రశంసనీయం.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన
కొల్లేరు నేత మోరు రామరాజు, కుమారుడు విజయ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జగన్ హయాంలోనే కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, కొల్లేరు ముంపునకు గురికాకుండా నాడు అధికారులతో సర్వే చేయించి చర్యలు తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొల్లేరు నేత మోరు రామరాజుపేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి లోని జగన్ క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి కారుమురి నాగేశ్వరరావుతో కలిసి కొల్లేరు నేత మోరు రామరాజు, కుమారుడు విజయ్ పుష్పగుచ్చాలు అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. పదవులు ఆశించకుండా పార్టీ పట్ల అంకిత భావంతో రామరాజు చేస్తున్న కృషిని జగన్ అభినందించారు. ఈసందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కొల్లేరు ప్రాంత ప్రజల మంచి చెడ్డలను అడిగి తెలుసుకున్నారు. రామరాజు జగన్ తో మాట్లాడుతూ కొల్లేరు ప్రాంత ప్రజల నిరక్షరాస్యత, అమాయక త్వాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వరద ముంపు సాకుతో కొల్లేరు ప్రాంతాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారని వివరించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక దిగువ కాంటూర్లో ఆక్రమణలకు, దౌర్జన్యాలకు అంతులేకుండా పోయిందన్నారు. కొల్లేరు ప్రాంతాన్ని సందర్శించాలని ఆయన ఆహ్వానం పలికారు. అందుకు జగన్ అంగీకరించి త్వరలోనే తాను వస్తానని హామీ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల తోపాటు వైద్యశాలల బాగోగుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలుచేసిన నాడు – నేడు పథకం ప్రశంసనీయమని రామరాజు కొనియాడారు. శిథిలావస్థలో ఉన్న తరగతి భవనాలు, ఆసుపత్రుల ఆధునికీకరణకు నాడు జగన్ సంకల్పించారన్నారు. నాడు నవరత్నాలతో పేద ప్రజల ఇంటి ముంగిటకే అనేక సంక్షేమ కార్యక్ర మాలు అమలు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. రానున్న కాలంలో కొల్లేరు ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి దోహదపడాలని జగన్ ప్రోత్సహించారని రామరాజు చెప్పారు. కొల్లేరు ప్రాంత సమస్యలపై ప్రజలతో అలాగే నాయకులతో ఎప్పుడు వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చునని జగన్ తెలిపారు.అనంతరం మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ వ్యక్తిగత న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిఇంకా ఎమ్మెల్సీలు, ఆడపడుచులతో రామరాజు కలిసి వారితో కాసేపు ముచ్చటించారు.