PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర స్థాయి పోటీలకు’కోట’ పాఠశాల విద్యార్థులు..

1 min read

విద్యార్థులను మరియు ఫిజికల్ డైరెక్టర్ లకు సన్మానం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అండర్-17 పోటీలో మంచి ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు కోట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సలీం బాష సోమవారం తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనిబైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు) కోట పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఉమ్మడి జిల్లా(కర్నూలు మరియు నంద్యాల)అండర్-17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడల సెలక్షన్స్ లో చక్కటి ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని శనివారం రోజు కర్నూలులో జిల్లా స్థాయి క్రీడా ప్రాంగణంలో జరిగిన జిల్లా స్థాయి సెలక్షన్స్ లో అండర్-17 బాలుర ఫుట్ బాల్ నందు పాఠశాల పదవ తరగతి విద్యార్థి కాటేపోగు చరణ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.ఇతను ఈ నెల 28 నుండి 30 వరకు పల్నాడు జిల్లా,వినుకొండ లో జరుగబోయే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని అలాగే మరో పాఠశాల పదవ తరగతి విద్యార్థి ఖాజా హుస్సేన్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ వెల్లడించారు.అనంతరం పాఠశాలలో ఇద్దరి విద్యార్థులను ప్రధానోపాద్యాయులు సిబ్బంది సన్మానించారు.రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులను,ఫిజికల్ డైరక్టర్ శ్రీనాథ్ ను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి,పాఠశాల  ఉపాధ్యాయులు వెంకట రమణ,వెంకటేశ్వర్లు, మల్లిఖార్జున రెడ్డి,రామిరెడ్డి, నాగశేషులు,రామకృష్ణ, సాలమ్మ,అరుణ,లలితమ్మ, సరోజిని దేవి,షంశాద్ బేగం, రూపావాణి, శారద,జరీనా,ఉషారాణి అభినందించారు.

About Author