పత్తికొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గా క్రాంతి నాయుడు నియామకం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఇన్చార్జిగా బి క్రాంతి నాయుడు మరోసారి ఎన్నికయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అది కూడా నియోజకవర్గ ఇన్చార్జిగా సమర్థవంతంగా పనిచేసినందుకు గాను ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి ఆయనను మళ్ళీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు.పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గాను, యువనాయకులు, అడ్వకేట్ క్రాంతి నాయుడు పనితీరుకు మిర్చి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా నియమించినందుకు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు క్రాంతి నాయుడు పత్తికొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పత్తికొండ నియోజకవర్గ, ప్రాంత అభివృద్ధి మరియు సాధికారత కోసం కృషి చేయాలి అని, ప్రజల సమస్యల మీద గళం వినిపించాలి అని షర్మిల అందులో తెలిపారు.