శ్రీశైలం ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపిన కురవ సంఘం నాయకులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర్ రెడ్డిని గురువారం సున్నిపెంటలో కలిసిన కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ ,సహాయ కార్యదర్శి కే .దేవేంద్ర శాలువా బొకేతో సన్మానించారు. కురువల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి వివరిస్తూ మీరు మా కురువ కులస్తులను ఆదుకొని అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి సమస్య పరిష్కరిస్తా మీకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు అల్లూరు వెంకటేష్ ,పెద్దపాడు పుల్లన్న పెద్దదేవులాపురం, శివప్రసాద్ ,వేల్పనూరు శివ వాదాల నాగశేషులు తదితరులు పాల్గొన్నారు.