కర్నూలు జిల్లా కాంగ్రెస్ నియోజకవర్గాల సమన్వయకర్తలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలా రెడ్డి రాష్ట్రం నందలి అసెంబ్లీ నియోజక వర్గములకు సమన్వయకర్తలను నియమించడం జరిగినది. అందులో భాగంగా కర్నూలు జిల్లా నందలి అసెంబ్లీ నియోజక వర్గములయిన కోడుమూరుకు మాజీ ఎమ్మెల్యే, కర్నూలు డిసిసి అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ, కర్నూలుకు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, ఎమ్మిగనూరుకు ఎం ఖాశీం వలి, ఆదోనికి జి రమేష్ యాదవ్, మంత్రాలయం పిఎస్ మురళీకృష్ణరాజు ను ఆలూరుకు చిప్పగిరి లక్ష్మీనారాయణ లను సమన్వయకర్తలు (ఇన్చార్జీలు) గా నియమించడం జరిగింది. (పత్తికొండకు ప్రకటించాల్సి ఉంది) షర్మిలా రెడ్డి డిసిసి కార్యాలయమునకు పంపిన ఉత్తర్వుల మేరకు నియోజకవర్గ ఇన్చార్జీలు బాధ్యతతో పని చేయాలని మీ నియోజకవర్గాలలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపైన పోరాడాలని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ప్రజా శ్రేయస్సు కొరకు పనిచేసి రాష్ట్ర కాంగ్రెస్ మరియు జిల్లా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలను జరిపి నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపించాలని పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారు నియోజకవర్గ ఇన్చార్జిలకు ఆదేశాలు జారీ చేయడమయినది.