PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ఆప్టా నూతన కార్యవర్గ ఎన్నిక పై కర్నూలు జిల్లా నాయకుల హర్షం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఆప్టా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు చిగురుపాటి శ్రీ కృష్ణవేణి  స్కూల్ ,పోరంకి లో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జి.ఎస్.గణపతి రావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆప్టా ప్రధాన భాద్యులు, కార్యవర్గ సభ్యులు హాజరై 2024 -2026కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జి.ఎస్.గణపతి రావు, విజయనగరం జిల్లాగౌరవాధ్యక్షులు : మెహిదీ మీర్జా, కృష్ణా జిల్లాప్రధాన కార్యదర్శి: కె. ప్రకాశ్ రావు, కర్నూలు జిల్లా ఆర్థిక కార్యదర్శి: ఎస్.నారాయణ రావు , విజయనగరం జిల్లానూతన కార్యవర్గం  జి ఓ 117 రద్దు చేసి , ఉన్నత పాఠశాల లో కలిపిన 3,4,5 తరగతులను తిరిగి పాత పాఠశాల కు తీసుకు రావాలని జి ఓ 3 ని పునరుద్ధరణ చేసి గిరిజన ప్రాంత వాసులకు న్యాయం చేయాలనితల్లికి వందనం ద్వారా చెల్లించే లబ్ధిని ప్రభుత్వ పాఠశాల లో చదివే విద్యార్థులకు మాత్రమే అందించాలిగౌరవ చంద్రబాబు  ఉద్యోగులకు నూతన పి ఆర్ సి వేసి , వెంటనే మధ్యంతరభృతి ని ప్రకటించాలనిఉద్యోగులకు  రావలసిన పాత బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని నూతన కార్యవర్గం తీర్మానించింది. ఈ సందర్బంగా కర్నూలు జిల్లా నుండి మరొక మారు కె ప్రకాష్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా కె . ప్రకాష్ రావు ఎన్నిక కావటం తో కర్నూలు జిల్లా ఆప్టా అధ్యక్షుడు మధుసూదన రెడ్డి , ప్రధాన కార్యదర్శి సేవా లాల్ నాయక్ మరియు  నంద్యాల జిల్లా అప్టా అధ్యక్షుడు అజీజ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ హర్షం వ్యక్తం చేశారు.

About Author