పదవి విరమణ పొందిన 9 మంది పోలీసులను సన్మానించిన కర్నూలు జిల్లా ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ అన్నారు.ఈ సంధర్బంగా శుక్రవారం పదవి వీరమణ పొందిన
1) పిసిఆర్ కర్నూలు ఎస్సై – ఎన్. అబ్దుల్ అజీజ్ .
2) స్పెషల్ బ్రాంచ్ ఎస్సై – డి. రాజన్న.
3) కర్నూలు ఒకటవ పట్టణ ఎస్సై – ఎస్. ఎమ్. డి. జాఫర్ హుస్సేన్.
4) కర్నూలు ఒకటవ పట్టణ ఎస్సై – పి. వి. రామిరెడ్డి
5) ఎఆర్ ఎస్సై – ఎస్. చంద్రశేఖర్ రావు.
6) ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ – ఎస్. చెంచయ్య
7) కర్నూలు ఒకటవ పట్టణ ఎఎస్సై – జి. ఇన్నయ్య,
8) చిప్పగిరి పియస్ ఎఎస్సై – ఎస్. జి. నజీర్ అహమ్మద్.
9) ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ – ఆర్. హరిబాబు.
జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. పోలీసుశాఖకు వారు అందించిన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు.కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగబాబు, స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజ్ యాదవ్, ఆర్ ఐలు జావేద్, నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు , పదవి విరమణ పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.