నేర సమీక్షా సమావేశం నిర్వహించిన కర్నూలు జిల్లా ఎస్పీ
1 min readవిధులలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసిన … జిల్లా ఎస్పీ.
ఇదే స్ఫూర్తి తో భవిష్యత్తులో బాగా పని చేయాలి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్షేత్రస్థాయి అధికారుల నుండి క్రిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పని చేయడం వలనే జిల్లాలో గణనీయంగా నేరాలు తగ్గాయని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆదివారం తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో బాగా పని చేయాలని సూచించారు. ఈ సంధర్బగా ఆదివారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైల తో జిల్లా ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్ ఐపియస్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. వివిధ కేసులలో, విధులలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు బాబు ప్రసాద్, శ్రీనివాసాచారి, వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ మరియు సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.