రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగ కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా, ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేసిన అల్ట్రా మెగా సోలార్ పార్క్, ప్రపంచంలోనే మొదటిది , పెద్దది అయిన గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏరియల్ వ్యూ సందర్శనకు విచ్చేశారు.ఈ సందర్భంగా శనివారం కర్నూలు ఎయిర్పోర్టులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ని కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చo అందజేశారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను, భద్రతను జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.