జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెల్పిన … కర్నూలు జిల్లా ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: (25.12.2024 ) క్రిస్మస్ పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బంది కి, వారి కుటుంబ సభ్యులకు కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రిస్మస్ పండుగ ఏసుక్రీస్తు యొక్క గొప్ప జీవితాన్ని మరియు ఆయన కరుణ మరియు క్షమాపణ సందేశాన్ని , నిత్య సత్యాన్ని విలువలను నిలబెట్టడానికి ఆయన పడిన కష్టాలను ప్రజలకు గుర్తు చేస్తుందన్నారు. క్రిస్మస్ పండుగ జిల్లా ప్రజలందరికీ ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావాలని ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ తెలిపారు.