కర్నూలు జిజిహెచ్ పరిపాలన విభాగంలో సడన్ సర్ప్రైజ్ విజిట్
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు,మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిపాలన విభాగంలో ఉన్న మినిస్ట్రీయల్ స్టాఫ్ పనితీరుపై సడన్ సర్ప్రైజ్ విజిట్ చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి లోని పరిపాలన విభాగంలో మినిస్ట్రీయల్ స్టాఫ్ విధులు నిర్వహిస్తున్న సీట్ల దగ్గర పోయి వారి యొక్క వివరాల గురించి ఏవో మరియు అకౌంటెంట్ ద్వారా ఆరా తీశారు అనంతరం వారు ఏ సమయంలో వస్తున్నారు, ఎఫ్ ఆర్ ఎస్ మరియు అటెండెన్స్ రిజిస్టర్ మరియు రికార్డులను పరిశీలించి ఫిర్యాదు దారుల ఫిర్యాదులపై సరైన రీతిలో క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు. కోర్టు కేసులు, మరియు ఇతర కేసులు ఏవైనా ఉంటే నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయపాలనలో ఉండేటట్లు చూసుకోవాలని AO (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) కి ఆదేశించారు.ఆసుపత్రి సిబ్బంది పని వేళలో సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు.ఆసుపత్రి సిబ్బంది విధి నిర్వహణలో ఎవరైనా బయటికి వెళ్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మినిస్ట్రీయల్ స్టాప్ సిబ్బంది విధులను మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి AO, శ్రీ.శ్రీనివాసులు, అకౌంటెంట్, శ్రీ.లతీఫ్ బేగ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, తెలిపారు.