PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ప్రభుత్వాసూపత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలి..ఎంపీ

1 min read

గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీని పెంపొందించి, ప్రైమరీ హెల్త్ సెంటర్లను అభివృద్ధి చేయాలి

మెడికల్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలి.. పార్లమెంట్ లో కేంద్రాన్ని కోరిన ఎం.పి బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వాసుపత్రిని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పార్లమెంట్ లో కేంద్రాన్ని కోరారు..బడ్జెట్  సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో ఆయన మాట్లాడారు.కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాలో చెప్పుకోవడానికి ప్రభుత్వాసుపత్రి ఒక్కటే ఉందని.. 8 జిల్లాల ప్రజలకు వైద్య సదుపాయాలను అందిస్తున్న కర్నూలు ప్రభుత్వాస్పత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తే రోగులకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు..ఇక గత వైసీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేయడంతో , ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.. జగన్ వైద్య యూనివర్సిటీలకు పేర్లు  మార్చుకోవడం తప్ప వైద్య రంగాన్ని పట్టించుకోక పోవడంతో రాష్ట్రంలో 2659 ఉన్న ఆసుపపత్రుల్లో 1232 ఆసుపత్రులు పని చేయడం లేదన్నారు..2014 టీడీపీ హయాంలో వైద్య సేవలు అందిచడంలో 4వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వం లో 10వ స్థానంలోకి పడిపోయిందన్నారు..ఇక వైద్య కళాశాలల్లో అధిక ఫీజులు ఉండడంతో , అక్కడ చదువుకొని వైద్యులు అయిన వారు వైద్యాన్ని ఆదాయ వనరులు గా చేసుకుంటున్నారాని..మెడికల్ కాలేజీలలో ఫీజులను నియంత్రించాలని కోరిన నాగరాజు..అలాగే గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీని పెంపొందించి, ప్రైమరీ హెల్త్ సెంటర్లను అభివృద్ధి చేయాలన్నారు.

About Author