PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు యంపీ బస్తిపాటి నాగరాజుకి కేంద్రమంత్రి పదవి కేటాయించాలి

1 min read

కర్నూలు జిల్లాలో కురువలకు రాజకీయ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు.

రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్.

సుంకన్న మదాసి కురువ.రాష్ట్ర అధ్యక్షులు.

మదాసికురువ/మదారికురువ హక్కుల పోరాట సమితి.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర వ్యాప్తంగావున్న కురువ సామాజిక వర్గాన్ని గుర్తించి కర్నూలు జిల్లాలో కురువ సామాజిక వర్గానికి రాజకీయ అవకాశాలను కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సామాజికవర్గ సమీకరణలో భాగంగా రాజకీయంగా వెనుకబడిన కురువ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి(పంచలింగాల)నాగరాజుకి కేంద్రమంత్రి పదవులలో అవకాశం కల్పించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,మదాసి,మదారి కురువ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న మదాసి కురువ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కర్నూలు నగరంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి కార్యాలయంలో వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో రాజకీయంగా అణగారిన సామాజిక వర్గమైన కురువలను గుర్తించి కర్నూలు యంపీ స్థానాన్ని కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రనారా చంద్రబాబు నాయుడు కురువలకు మరోసారి రాజకీయ భవిష్యత్తును ఇచ్చారని,బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీకి అని మరోసారి రుజువు చేసారన్నారు.తెలుగుదేశం పార్టీ కురువ సామాజిక వర్గానికి ఇచ్చిన అవకాశాన్ని,నమ్మకాన్ని కురువలు వమ్ముచేయలేదని జిల్లాలోని కురువలు సాటీ సోదర సామాజిక వర్గాలను,కులాలను కలుపుకుని వారి సంపూర్ణ సహకారంతో లక్షా పదకొండువేలకు పైగా మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కర్నూలు యంపీ స్థానంలో బస్తిపాటి నాగరాజుని గెలిపించుకోగలిగారని అన్నారుప్రస్తుతం తెలుగుదేశం పార్టీకీ కేంద్రంలో సైతం ప్రాధానపాత్ర పోషించే అవకాశం ఉన్నందున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కురువ సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్త,సౌమ్యుడు,ప్రజానాయకుడు,అత్యంత సామాన్యుడైన కర్నూలు యంపీ బస్తిపాటి(పంచలింగాల)నాగరాజుకి కేంద్రమంత్రి పదవులలో అవకాశం కల్పించి ఆశీర్వదించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు అశోక్ కురువ గోవిందు,కురువ కృష్ణయ్య,కురువ పరమేష్,కురువ మల్లేష్,కురువ మల్లికార్జున,కురువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author