క్రీడా రంగం అభివృద్ధికి కృషి చేస్తా… కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్రీడా రంగం అభివృద్ధి కి కృషి చేస్తానని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు తెలిపారు.. క్రీడా సంఘాల ప్రతినిధులు, స్టేడియం శిక్షకులు ఎం.పి నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ఎం.పి దృష్టి కి తీసుకెళ్లారు..అనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ పిల్లలకు చదువు తో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడలు మనిషి శక్తిని కొత్త పుంతలు తొక్కించడంతో పాటు మనోరంజక సాధనాలలో ముఖ్యభాగమై పోయిందన్నారు.. సాంప్రదాయకమైన ఆటల కంటే, ఆధునిక ప్రపంచ గుర్తింపుగల పోటీ ఆటలలో ప్రావీణ్యము సంపాదిస్తే, పేరు, ప్రతిష్ఠలతో పాటు మంచి ఆదాయము లభించే అవకాశాలున్నాయన్న ఆయన .. జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదని , అయితే వారికి సరైన సదుపాయాలు కలిపిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత రాణిస్తారన్నారు..ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యోగ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ డ్రాగన్ బోటు అసోసియేషన్ అధ్యక్షులు, జి.శ్రీధర్ రెడ్డి,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.భూపతి రావు, రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి ,జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రుద్రా రెడ్డి,టిడిపి లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు.