సిసి కెమెరాలలో ఆటో ను గుర్తించి చీరలను రికవరీ చేసిన కర్నూలు పోలీసులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బాధితుడికి చీరలు అప్పగించిన … కర్నూలు ఒన్ టౌన్ సిఐ రామయ్యనాయుడు, కమాండ్ కంట్రోల్ సిఐ శివశంకర్.కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి చెందిన ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జున్ డిసెంబర్ 26 వ తేది కర్నూల్ వన్ టౌన్ శ్రీనివాస క్లాత్ మార్కెట్ పాత బస్టాండ్ లో షాపింగ్ చేసి గుర్తు తెలియని ఆటో ఎక్కారు. షాపింగ్ చేసిన కొత్త దుస్తుల బ్యాగును ఆటోలో మర్చిపోయారు.కర్నూలు ఒన్ టౌన్ పోలీసులకు డాక్టర్ నాగార్జున్ ఫిర్యాదు చేశారు. కర్నూల్ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ మరియు మున్సిపల్ కమీషనర్ సహాకారంతో ఏర్పాటు చేయించిన సీసీ కెమెరాల ద్వారా కర్నూలు ఒన్ టౌన్ పోలీసులు ఆ ఆటో యొక్క ఆచూకీ గుర్తించారు . ఆటో డ్రైవర్ ను విచారించి చీరల బ్యాగును డాక్టర్ నాగార్జున్ కి కర్నూలు పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ లో అప్పగించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ వన్ టౌన్ సిఐ M రామయ్య నాయుడు , కర్నూలు, కమాండ్ కంట్రోల్ సిఐ P శివశంకర్ , కర్నూలు వన్ టౌన్ పీఎస్ కి చెందిన HC మహబూబ్ బాషా ,PC షేక్షావలి, మరియు కమాండ్ కంట్రోల్ కానిస్టేబుల్ విజయ్ ఉన్నారు.