క్రీడాకారులను ప్రోత్సహిస్తే కర్నూలు రాష్ట్రంలో స్పొర్ట్స్ క్యాపిటల్ గా ఏర్పడుతుంది
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మార్షల్ ఆర్ట్స్ చిన్నారులకు ఎంతో మంచిదని కర్నూలు కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. కర్నూలు లోని మున్సిపల్ హైస్కూలు మైదానంలో సిలంబం శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణా శిభిరానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవంబర్ నెల 10 వ తేదీన గుంటూరు లో జరిగే సౌత్ జోన్ చాంపియన్ షిప్ పోటీలకు కర్నూలు నుంచి వెళ్తున్న 11 మంది క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. గుంటూరు కి వెళ్లే క్రీడాకారులకు టీషట్లు పంపిణీ చేశారు. మార్షల్ ఆర్ట్స్ లో చిన్నారులు పాల్గొనడం వల్ల వారు అన్ని రంగాల్లో రాణిస్తారని డాక్టర్ పేర్కొన్నారు. సెల్ ఫోన్, మత్తు పదార్థాలు ఎక్కువైనందున సమాజంలో మహిళలపై ఆత్యాచార ఘటనలు ఎక్కువై వారికి భద్రత కరువైందన్నారు.ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు వారు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. బాలికలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో పాల్గొనడం వల్ల వారికి క్రమశిక్షణ వస్తుందని డాక్టర్ తెలిపారు. చిన్నారులు క్రమశిక్షణతో మెలగడం వల్ల భారతదేశానికి భవిష్యత్తు లో మంచి దేశంగా గుర్తింపు వస్తుందన్నారు. మార్షల్ ఆర్టృలో యోగా, ప్రాణాయామం, ధ్యానం ఉండడం వల్ల వారు ఆరోగ్యం గా తయారు అవుతారన్నారు. గుంటూరు కి వెళ్లే క్రీడాకారులకు శిక్షకుడు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని డాక్టర్. శంకర్ శర్మ కోరారు. సౌత్ జోన్ చాంపియన్ షిప్ పోటీలకు వెళ్లే క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి కర్నూలు కు మంచి పేరుతీసుకోని రావాలన్నారు. ఈకార్యక్రమంలో క్రీడాకారులకు పండ్లు పంపిణీ చేశారు.