PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర స్థాయిలో.. కర్నూలు‘ కిక్​ బాక్సర్ల’ ప్రతిభ

1 min read

సీనియర్​ విభాగంలో  ఐదుగురు గోల్డ్​​ మెడల్స్ కైవసం​

  • సబ్​ జూనియర్​ కేటగిరిలో  ఐదుగురు గోల్డ్​, ఒకరు సిల్వర్​  మెడల్స్​
  • అభినందించిన కిక్​ బాక్సింగ్​ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్​
  • కేక్​ కట్​ చేసి సంబరాలు చేసుకున్న క్రీడాకారులు

కర్నూలు,పల్లెవెలుగు: కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో స్పోర్ట్స్​ అథారిటీ మున్సిపల్​ ఇండోర్​ స్టేడియంలో  మే 29,30వ తేదీలలో జరిగిన రాష్ట్ర స్థాయి కిక్​​ బాక్సింగ్​ పోటీలలో కర్నూలు జిల్లాకు చెందిన త్రినాథ్​ అకాడమీ కిక్​ బాక్సర్లు అత్యుత్తమ ప్రతిభ చాటారు. సీనియర్​ విభాగంలో ఐదుగురు బరిలో దిగగా  ఐదుగురు బంగారు పతకాలు సాధించారు. సీనియర్​ కేటగిరిలో  సిగ్గెల్లి సుజిత్​ కిక్​ లైట్​ విభాగంలో. గుర్రం హరి కల్యాన్​ లో కిక్​, నర్ల లోకేష్​ రెడ్డి పాయింట్​ ఫైట్​,  పెరుమళ్ల అనురాగ్​ జోసెష్​ సామ్రాట్​  కిక్​ లైట్​, ఎం.డి. నాగరాజు పాయింట్​  ఫైట్​లో బంగారు పతకాలు సాధించారు.  అదేవిధంగా సబ్​ జూనియర్​ కేటగిరిలో ఆరుగురు  క్రీడాకారులు బరిలో దిగగా…  ఐదుగురు బంగారు, ఒకరు వెండి పతకాలు కైవసం చేసుకోవడం విశేషం.  రామేశ్వర్​ చంద్ర , నమేష్​, ఎన్​.శశిధర్​, అరుణ్​, జాహ్నవి, రామ్​ చరణ్​ రింగ్​లోకి దిగి ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలో అశేష ప్రతిభ చూపిన   సిగ్గెల్లి సుజిత్ , హరి కల్యాన్​, నర్ల లోకేష్​ రెడ్డి, పెరుమళ్ల అనురాగ్​ జోసెష్​ సామ్రట్​, ఎండి నాగరాజు జూలైలో గోవాలోని మపుసలో జరిగే జాతీయ స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలకు ఎంపికైనట్లు కోచ్​ నరేంద్ర తెలిపారు.  

అభినందించిన అకాడమీ చైర్మన్​

కర్నూలు త్రినాథ్​ కిక్​ బాక్సింగ్​ అకాడమీ చైర్మన్​, అమ్మ,ఆర్క్​ హాస్పిటల్స్​ అధినేత డా. త్రినాథ్​ విజేతలైన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా కేక్​ కట్​ చేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలో విజేతలైన సీనియర్​ కిక్ బాక్సింగ్​ క్రీడాకారులు జూలైలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. కిక్​ బాక్సింగ్​  లో అశేష ప్రతిభ చాటి త్రినాథ్​ కిక్​ బాక్సింగ్​ అకాడమీకి మంచి పేరు తీసుకువచ్చిన క్రీడాకారులను డా.త్రినాథ్​ ప్రశంసించారు. మున్ముందు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

About Author