పెసలదిన్నె సర్పంచ్ భర్త కురువ వెంకప్ప మృతి తీరని లోటు…
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామం సర్పంచ్ భర్త కురువ వెంకప్ప గారు సోమవారం ఉదయం కర్నూలు నగరం లోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో అకాల మరణం చెందారు. ఈ వార్త చాలా బాధాకరం, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము, కర్నూలు జిల్లా కురువ సంఘం చేసే ప్రతి కార్యక్రమం లో పాల్గొంటుండేవారు, అంతేకాక యెమ్మిగనూరు మండల కురువ సంఘము లో కూడ సమర్థవంతంగా పనిచేసేవారని కొనియాడారు.వారి కుటుంబ సభ్యులకు జిల్లా కురువ సంఘము తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేయుచున్నాము. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము, సొమవారం సాయంకాలం జిల్లా కురువ సంఘం ఉపాధ్యక్షులు తిమ్మాపురం కె. టీ.ఉరుకుందు,ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, సహాయ కార్యదర్శి బి. సి. తిరుపాల్, సంఘం నాయకులు ఎల్లయ్య నగర నాయకుడు కె. కొండన్న, మసీదుపురం ఆంజనేయులు,తదితరులు పెసలదిన్నె గ్రామం లోని వారి భౌతిక దేహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.