వైద్య రంగంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య ఉద్యోగులు, కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మునెప్ప ప్రభుత్వాన్ని కోరారు. శనివారం స్థానిక హెల్త్ కమ్యూనిటీ సెంటర్ హాస్పిటల్ ఆవరణంలో ఆనంద్ అధ్యక్షతన జరిగిన సమావేశఒలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ఏఐటియుసి జిల్లా డిప్యూటీ సెక్రటరీ ఎన్ .కృష్ణయ్య ఏఐటియుసి తాలూకా నియోజవర్గ అధ్యక్ష కార్యదర్శులు జి. నెట్టే కంటయ్య, ఎం. రంగన్న, గుండుబాసాలు హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎస్ మునెప్ప మాట్లాడుతూ, కార్మికులకు శానిటేషన్ కార్మికులకు జీవో నెంబర్ 549 ప్రతి కార్మికులకు నెలకు 16 వేలు వేతనం ఇవ్వాల్సి ఉండగా, తక్కువ జీతాలు ఇస్తున్నారని ఐదు నెలలు గా జీతాలు చెల్లించకుంటే వారి కుటుంబాలు ఎలా గడపాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కు జీవో నెంబర్ 43 ప్రకారం 11000 జీతం రావాల్సి ఉంటే తక్కువ జీతం ఇస్తున్నారనీ, అది కూడా మూడు నెలలు జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అలాగే ఈఎస్ఐ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్మికులకు నాలుగు వారాంతపు సెలవులు, క్యాజువల్ సెలవులు, జాతీయ పండుగ సెలవులు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదనీ అన్నారు. మరియు ఆరోగ్య మిత్ర బ్లడ్ బ్యాంక్ ఆపరేటర్లకు , జి డి ఏ సిబ్బందికి కనీస వేతనం 24 వేల చెల్లించాలని, ఆప్కోస్ లో చేస్తున్న వారిని సర్వీసు రెగ్యులర్ ఉద్యోగులుగా చేయాలని కోరారు.అలా కాని పక్షంలో టైం స్కేల్ అయినా వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య సిబ్బంది .