కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగుల శ్రమదానం
1 min readపరిశుభ్రతతోనే ఆరోగ్యం.. జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటి శ్రమదానం నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ లోని వివిధ శాఖల కార్యాలయాల్లో, పరిసరాలలో శనివారం శ్రమదానం చేపట్టారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించి ఆయా కార్యాలయాలను శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి స్వయంగా కార్యాలయం ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛ పరిరక్షణలో భాగస్వాములయ్యారు. జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ పిడి. డాక్టర్:ఆర్ విజయరాజు, డ్వామా పిడి ఎ. రాము, మున్సిపల్ కమీషనరు ఎన్. భానూప్రతాప్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం. ముక్కంటి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలెక్టరేట్ ప్రాంగణం, ప్రాంగణంలోవున్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను, తొలగించిన చెత్తను, వ్యర్ధాలను ట్రాక్టర్లలో వేశారు. ఈ పనుల్లో చురుగ్గా వ్యవహరించిన మహిళా అధికారులను, సిబ్బందినీ డిఆర్ఓ పుష్పమణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవిన్యూ అధికారి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యానికి భధ్రత ల్పించడంలో ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ప్రతిజ్ఞ చేశారు.