లహరి మృతి..ప్రమాదవశాత్తే:ఎస్పీ
1 min readవీరిద్దరికీ 3 సం.ల నుండి పరిచయం
పిల్లల పట్ల తల్లిదండ్రుల్లో మార్పు రావాలి
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ,ఏఎస్పీ..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సోమవారం తెల్లవారు జామున మరణించిన విద్యార్థి లహరి(17) మృతి ఇతర కోణాల్లో ఏమీ లేదని ప్రమాదవశాత్తు ప్రకారమే జరిగిందని నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు.నందికొట్కూరు పట్టణంలో బైరెడ్డి నగర్ కాలనీలో లహరి ఉంటున్న అవ్వా తాత నివసిస్తున్న ఇంటిని ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఎన్ యుగంధర్ బాబు సంఘటన ప్రాంతాన్ని క్షుణ్ణంగా వారు మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు.ఇంటిలో కాలిన అమ్మాయి వస్తువులను పోలీసులు సీజ్ చేశారు.అంతే కాకుండా ఇంటిపక్కల వారిని విచారించారు.అనంతరం సాయంత్రం పట్టణంలో సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ నిందితుడు రాఘవేంద్ర మరియు అమ్మాయి లహరి ఒకే పాఠశాలలో చదువుకున్నారు.గత 3 సం.గా వీరిద్దరికీ పరిచయం ఉంది. వీరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు.96 రోజులకు గాను 9 వందల సార్లు ఫోన్ లో వీరు మాట్లాడినట్లు..ఇక్కడికి అబ్బాయి వచ్చీ వెళ్తూ ఉన్నారు.ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అమ్మాయి,అబ్బాయి ఇద్దరూ ఇంట్లో ఉండగా ఇంట్లో తిన్నర్, టర్పెంటాయిల్, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయని ప్రమాదవశాత్తు జరగడం వల్లే లహరి మృతి చెందిందని అబ్బాయి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పరిస్థితి క్రిటికల్ గా ఉందని వారు తెలిపారు.ఇంకా వివిధ రిపోర్టులు రావాల్సి ఉందని వాటిని బట్టి మేము ముందుకు వెళ్తామన్నారు.అమ్మాయిల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని వారికి సెల్ ఫోన్లు ఇవ్వడం వంటివి చేయకూడదని రాత్రి సమయాల్లో కుటుంబ సభ్యులు కాకుండా అమ్మాయిలకు మాత్రమే గది ఇవ్వటం మంచిది కాదన్నారు. మంచి క్రమశిక్షణతో పిల్లలను పెంచాలని వారి ప్రవర్తనను గమనిస్తే ఇలాంటివి జరగవని ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మరియు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు పత్రికా ముఖంగా తల్లిదండ్రులను కోరారు.అమ్మాయి మృతి వెనుక ఏవేవో కారణాలు వస్తున్నాయని అలాంటివి ఏమీ లేవని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్,సీఐలు టి సుబ్రహ్మణ్యం,వై ప్రవీణ్ కుమార్ రెడ్డి,ఎస్సైలు ఓబులేష్,తిరుపాలు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.