PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలను లక్షాధికారులను చేయడమే “లఖ్ – పతి దీదీ” ప్రధాన ఉద్దేశం

1 min read

జిల్లాలో 663 పొదుపు స్వయం సహాయక సంఘాల లఖ్ – పతి దీదీలకు రూ.62.64 కోట్ల బ్యాంకు రుణాల పంపిణీ

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: లఖ్ – పతి దీదీ కార్యక్రమం కింద మహిళలు తమ జీవనోపాధులను పెంపొందించుకొని పిల్లలను చదివించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని జెల్గాన్ నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న”లఖ్ – పతి దీదీ’ కార్యక్రమం కింద దేశ ప్రధాని నరేంద్రమోడీ మహిళలను సత్కరించే కార్యక్రమాన్ని నంద్యాల కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్  జి. రాజకుమారి, డిఆర్డిఏ – వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ వైబి శ్రీధర్ రెడ్డి, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొని వీక్షించారు.అనంతరం జిల్లా కలెక్టర్  జి. రాజకుమారి మాట్లాడుతూ లఖ్ – పతి దీదీ కార్యక్రమం కింద మహిళలను లక్షాధికారులను చేయాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. పూర్వపు రోజుల్లో మహిళలు ఇంటికే పరిమితమై తమ పిల్లలను చదివించుకుని ఆధారపడే వారిని, ప్రస్తుత జనరేషన్ లో ఒకరిద్దరికే పరిమితమై కొడుకు కంటే కూతురికే అధిక ప్రాధాన్యతనిస్తూ వివిధ వైవిద్యమైన జీవనో పాదులపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. పిల్లల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి ఉన్నత స్థితికి పాటుపడాలని సూచించారు. ప్రభుత్వం అందించిన లక్ష రూపాయల రుణాన్ని ఉపయోగించుకుని జీవనోపాధి పెంచుకునేలా చూడాలన్నారు. ప్రతి ఒక్క మహిళను లక్షాధికారులను చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.జిల్లాలో 663 స్వయం సహాయక సంఘాల సభ్యులైన లఖ్ – పతి దీదీలకు రూ. 62.64 కోట్ల బ్యాంకు రుణాల పంపిణీ చేస్తున్నామన్నారు. లఖ్-పతిదీదీ అంటే ఒక లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక కుటుంబ ఆదాయాన్ని ఆర్జించే ఒక స్వయం-సహాయక సంఘం సభ్యురాలని కలెక్టర్ తెలిపారు. మహిళలు తమ ఆదాయం కోసం మాత్రమే కాకుండా, స్థిరమైన జీవనోపాధి పద్ధతులతో పాటు ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాలన్నారు.  అనంతరం జిల్లాలో 663 స్వయం సహాయక సంఘాల లఖ్ – పతి దీదీలకు రూ.62.64 కోట్ల బ్యాంకు రుణాలకు సంబంధించిన మెగా చెక్ ను జిల్లా కలెక్టర్, డిఆర్డిఎ పిడిలు పంపిణీ చేశారు. అలాగే నాలుగు మండలాల మహిళా సమాఖ్యలకు 40 లక్షల రూపాయల సిఐఎఫ్ నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎం దానం, ఎపిఎంలు సురేష్, ఎల్లయ్య, శ్రీనివాసులు, బాబూరావు,పుణ్యవతి, స్వయం సహాయక సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

About Author