మహిళలను లక్షాధికారులు చేయడంకోసమే లఖ్-పతి దీదీ అమలు
1 min readజిల్లాలో 491 స్వయం సహాయక సంఘాల లఖ్-పతి దీదీ లకు రూ. 55.18 కోట్లు బ్యాంకు రుణాలు పంపిణీ
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
40 లక్షల చెక్కును సహాయక సంఘాలకు అందజేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మహిళలలో ఆర్ధిక స్వాలంబన పెంపొందించి ప్రతి మహిళను లక్ష్యాధికారిగా చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మహారాష్ట్రలోని జెల్గాన్ నుంచి ఆదివారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లఖ్-పతి దీదీ కార్యక్రమం కింద మహిళలను సత్కరించే కార్యక్రమంలో దేశ ప్రధాని శ్రీ నరేంధ్రమోడి పాల్గొన్నారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, చింతలపూడి శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ లఖ్-పతి దీదీ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంధ్రమోడి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కింద మహిళలను లక్ష్యాధికారులను చేయాలని వారిని అన్ని రంగాల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సదుద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్నా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అందించిన రుణాన్ని ఉపయోగించుకొని జీవనోపాధి పెంపొందించుకోవడమే కాకుండా కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసుకొని అభివృద్ధి సాధించేందుకు ఈ అవకాశాలను ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. జిల్లాలో 491 స్వయం సహాయక సంఘాల సభ్యులైన లఖ్-పతి దీదీ లకు రూ. 55.18 కోట్లు బ్యాంకు లింకేజి కింద రుణాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే 4 మండలాలైన కొయ్యలగూడెం, కుక్కునూరు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం 28 స్వయం సహాయక సంఘాలకు రూ. 40 లక్షల చెక్కును పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏలూరు జిల్లాకు 1,22,160 లఖ్-పతి దీదీ ల లక్ష్యం కేటాయించడం జరిగిందని తెలిపారు. దీని నిమిత్తం రూ.36.14 కోట్లు ఆర్ఎఫ్ కింద బ్యాంకు లింకేజీ కింద రూ. 1100 కోట్లు నూరు రోజులు లక్ష్యంగా తీసుకోవడం జరిగిందని తలిపారు. కార్యక్రమంలో చింతలపూడి శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్ధిక పరిపుష్టి దిశగా అడుగులు వేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దేశానికి ఆదర్శంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు నిలవాలని అన్నారు. స్వయం సహాయ సంఘాలు తీసుకున్న రుణాలను జీవోపాధి పద్దతులు పాటించడం ద్వారా మరింత ఆర్ధిక పరిపుష్టి సాధించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, చింతలపూడి శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్, మహిళా స్వయం సహాయ సంఘాలకు జిల్లాలోని 4 మండలాల సమాఖ్యలకు 12 గ్రామాల సంఘాలకు 28 స్వయం సహాయక సంఘాలకు రూ. 40 లక్షల చెక్కును, బ్యాంకు లింకేజి కింద 491 స్వయం సహాయక సంఘాలకు రూ. 55.18 కోట్లు చెక్కులను అందజేశారు. తదుపరి మహిళా స్వంయ సహాయక సంఘాల సభ్యులకు సన్మాన ధృవపత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. రుణాలు పొంది వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ నెలవారీ ఆదాయం గురించి అడిగితెలుసుకున్నారు. వీటిలో పాడిగేదెలు, చిరుధాన్యాల వ్యాపారం, పచ్ఛళ్లు, టైలరింగ్, జ్యూయిలరీ, బట్టల అమ్మకం, చేపల వ్యాపారం, హోటల్ నిర్వహణ, తదితర వారు నిర్వహిస్తున్న వ్యాపారాల గురించి తెలుసుకొని వారికి అవసరమైన బ్యాంకు లోన్ల గురించి అడగడం జరిగింది. మహిళా స్వయం సహాయక సంఘాల వారు చేపడుతున్న చిరుధాన్యాలు స్టాల్ ను ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ లో ఏర్పాటు చేసేలాగా చర్యలు చేపట్టాలని డిఆర్డిఏ పిడిని ఆదేశించడం జరిగింది. కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, డిపిఎం అనిత, ఆంధ్రప్రదేస్ స్త్రీనిధి బ్యాంక్ డైరెక్టర్ తోట కృపామణి, స్వయం సహాయక సంఘాల సమాఖ్య సభ్యులు, డిఆర్డిఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.