PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా లఖ్ పతి దీదీ పథకం

1 min read

లఖ్ పతి దీదీ పథకాన్ని మహిళల సద్వినియోగం చేసుకొని లక్షాధికారులు కావాలి…ఎం.పి బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లఖ్ పతి దీదీ పథకాన్ని ప్రవేశ పెట్టిందని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు తెలిపారు… కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లఖ్ పతి దీదీ కార్యక్రమంలో పాణ్యం, కోడుమూరు ఎం.ఎల్.ఏ లు గౌరు చరితా రెడ్డి , బొగ్గుల దస్తగిరి లతో కలిసి ఆయన పాల్గొన్నారు..ఈ సందర్భంగా జిల్లాలోని 826 మంది స్వయం సహాయక సంఘాల లఖ్ పతి దీదీల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రూ.57.60 కోట్ల మెగా చెక్కును ఎం.పి , ఎం.ఎల్.ఎలు అందజేశారు.. అనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లఖ్ పతి దీదీ పథకాన్ని మహిళలు సరిగ్గా వినియోగించుకుని లక్షాధికారులు కావాలన్నారు.. పొదుపు సంఘాలలో ని మహిళలు అందరూ ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక లబ్ధిని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. ఇక పొదుపు సంఘాల ద్వారా బ్యాంకుల నుండి రుణాలు పొంది సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ సకాలంలో పొందిన మొత్తాన్ని చెల్లిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని ఎం.పి తెలిపారు..ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవ్య, డీఆర్డీఏ పిడి సలీం బాషా, ఎల్డిఎం రామచంద్రరావు, పొదుపు సంఘాల మహిళలు , సీఆర్పీలు, బుక్ కీపర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author