భూ సేకరణను త్వరితగతిన పూర్తిచేయాలి
1 min readజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు సంబంధితులకు పరిహారం అందచేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూ సేకరణ అంశం పై జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ హెచ్ 340సి కింద నంద్యాల చెక్ పోస్ట్ నుండి గార్గేయపురం వరకు, సఫా కళాశాల నుండి గార్గేయపురం వరకు జరుగుతున్న బై పాస్ రోడ్డు పనులకు సంబంధించి 2 గ్రామాలకు త్వరితగతిన పరిహారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు… అదే విధంగా నేషనల్ హైవే కింద ఎన్ని ప్రాజెక్టు లు ఉన్నాయనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఆర్బిట్రేషన్ కేసులు ఎన్ని వచ్చాయి ,అందులో ఎన్ని డిస్పోస్ అయ్యాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయని వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో డి ఆర్ ఓ మధుసూదన్ రావు, కర్నూలు ఆర్డిఓ శేషిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.