దివంగత కార్మిక నేత కామ్రేడ్ కె.మునిస్వామి మాతృమూర్తి మృతి
1 min readసంతాపం వ్యక్తం చేసిన ప్రముఖ న్యాయవాది ఎం.నాగభూషణం రెడ్డి మరియు మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక సుందర్ సింగ్ కాలనీకి చెందిన దివంగత కార్మిక నేత డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్.కె.మునిస్వామి మాతృమూర్తి కె.వెంకటమ్మ (99) మంగళవారం సాయంత్రం మృతి చెందారు.ఆమె మృతికి ప్రముఖ న్యాయవాది ఎం.నాగభూషణం రెడ్డి,డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం,ఉపాధ్యక్షులు బి.లక్ష్మన్న,ఎర్రగుంట్ల డ్రైవర్ సుబ్బరాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.బుధవారం స్థానిక సుందర్ సింగ్ కాలనీలోని మృతురాలి స్వగృహంలో ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక వర్గానికి గొప్ప ఉద్యమ నేతను అందించిన మాతృమూర్తిగా ఆమెను కొనియాడారు.ఆమె మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లు టి.శివరాం ప్రధాన కార్యదర్శి డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ డోన్.