న్యాయవాదులు అంకిత భావం తో పనిచేయాలి… జడ్జి ఎంఎస్ భారతి
1 min readపదోన్నతి పై బదిలీ అయిన జడ్జికి ఘనంగా వీడ్కోలు పలికిన న్యాయవాదులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : న్యాయవాదులు అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందేలా చూడాలని జూనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి అన్నారు. పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి సీనియర్ సివిల్ జడ్జి గా పదోన్నతి పొంది చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కు బదిలీ అయ్యారు. పదోన్నతి పై బదిలీ అయిన జడ్జి ఎంఎస్ భారతిగారిని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి ఆధ్వర్యంలో న్యాయవాదులు శాలువా, పూలమాలలతో సన్మానించి, ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ న్యాయవాదులు రెగ్యులర్ గా కోర్టు కు హాజరై , కేసుల పట్ల విషయ పరిజ్ఞానం పెంపొందించుకుని కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. న్యాయవాదులు నిత్య విద్యార్థులు గా ఉండాలన్నారు. పత్తికొండ లో విధి నిర్వహణలో తనకు సహకారం అందించిన న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం న్యాయవాదులు జడ్జి తో కలసి కోర్టు ముందు గ్రూపు ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షుడు రవికుమార్, కోశాధికారి రాజశేఖర్, సహాయ కార్యదర్శి వాసు, సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, సురేష్ కుమార్, సత్య నారాయణ, వెంకట్రాముడు, హుల్తెన్న, నాగభూషణం రెడ్డి, సురేంద్ర కుమార్, మల్లికార్జున, కృష్ణయ్య, నరసింహయ్య, సోమప్ప, రామన్న గౌడ్, రవి ప్రకాష్,నాగలక్ష్మయ్య, జటంగి రాజు, దామోదర్ ఆచారి, శ్రీనివాస రెడ్డి, మధు బాబు, కాశీ విశ్వనాథ్, ప్రసాద్ బాబు, శ్రీకాంత్ రెడ్డి, సుధా కృష్ణ, మధు గౌడ్, వెంకటేశ్వర్లు, సూరజ్ నబి,భాస్కర్, లక్ష్మణ్ రావు, చిన్న తదితరులు పాల్లొన్నారు.