ఎంసీపీఐయు జిల్లా సమన్వయకర్తగా లాజరస్ ఎన్నిక..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంసీపీఐయు జిల్లా సమన్వయకర్తగా లాజరస్ ఎన్నికయ్యారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్ లో ఏర్పాటు చేసిన భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)ఆవిర్భవ సమావేశాన్ని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏఐఎఫ్డిఎస్)రాష్ట్ర కన్వీనర్ డక్క కుమార్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. లాజరస్ పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ ఎస్ కే ఖాదర్ బాష హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ టైగర్, తెలంగాణ సాయుధ భూపోరాట యోధుడు,మాజీ శాసనసభ్యులు అయిన కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ స్థాపించిన పార్టీ భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)అని ఓంకార్ పోరాటాల అడుగు జాడల్లో నడిచి ఈ ఆశయం గురించి ఆయన పోరాడారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేశాడనిఅన్నారు. జిల్లాలో ఎంసీపీఐయు పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తామని ప్రజల సమస్యలపై పోరాటానికి ఎంసీపీఐయు పార్టీ నూతన కమిటీ సభ్యులు దీన్ని కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది.మతం,కులం పేరుతో దాడులు ఎక్కువగా అయ్యాయాన్ని రాష్ట్రంలో మహా కూటమి బిజెపిని సంకలో ఎత్తుకొని ఊరూరా తిరిగి మత ఉన్మాదానికి నాంది పలుకుతోందని వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ నూతన కమిటీలో లింగాల శ్రీనివాసులు,ఆవుల కృష్ణ, రాజు,దేవరకొండ సుజాత, బొల్లవరం మేరీ,బండారి బాలస్వామితో పాటు 18 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.