మీడియాపై నాయకుల దాడి అమానుషం..
1 min readనందికొట్కూర్ లో ఏపీయూడబ్ల్యూజే నిరసన..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మీడియా స్వేచ్ఛను హరించడం అన్యాయమని ఏపీయూడబ్ల్యూజే నందికొట్కూరు తాలూకా అధ్యక్షులు నగేష్ అన్నారు.శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పాత్రికేయులు రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేముల మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలను కవర్ చేయడానికి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై అక్కడి అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడి గాయపరచడం బాధాకరమన్నారు.విధుల నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడానికి ఖండిస్తున్నట్లు తెలిపారు.ఇది పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటనపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నట్లు ఆరోపించారు.ఇలాంటి దాడులను ప్రోత్సహించకూడదని చెప్పారు.నిందితులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకొని దాడికి పాల్పడ్డ వ్యక్తులపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని అన్నారు.జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పోలీసు యంత్రాంగం తీసుకోవాలన్నారు.అనంతరం తహసిల్దార్ శ్రీనివాసులు కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూర్ ఏపీయూడబ్ల్యూజే నాయకులు చంద్రశేఖర్,నరేష్, జయరాజ్,గోపి, ఆంజనేయులు,ప్రేమ్ కుమార్, ప్రదీప్,రాజా,స్వామన్న, ఖల్లీల్,స్వాములు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు రఘురాం మూర్తి, వెంకటేశ్వర్లు,బీభీ పాల్గొన్నారు.