జిల్లా కలెక్టర్ ని కలిసిన ఏపీ ఎన్జీవోస్ నాయకులు
1 min readఉద్యోగ ఉపాధ్యాయులు బాగా పనిచేశారు
పోలింగ్ శాతం గతం కంటే ఎక్కువగా నమోదయింది
జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు కలెక్టరేట్ లో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ని ఏపీ ఎన్జీవోస్ నాయకులు శుక్రవారం ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. మే 13 న జరిగిన సార్వత్రిక ఎన్నికలు సజావుగాప్రశాంతంగా నిర్వహించినదుకు వారికి పూల మొక్క నిచ్చి శాలువా కప్పి సన్మానించరు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్,కార్యదర్శి నెరుసు రామారావు. కలెక్టర్ తో మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గతం కంటే ఎక్కువగా నమోదు అయ్యింది ని. స్వీప్ ద్వారా ఓటరు ని చైతన్యం చేసి పోలింగ్ బూత్ వరకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చక్కగా చేసారని. ఐతే దూర ప్రాంతాలకు బస్ లు ఏర్పాట్లు తక్కువ అయ్యాయని రెమ్యునరేషన్ విషయం కూడా వారి దృష్టికి తీసుకొని వెళితే పోలింగ్ ట్రైనింగ్ క్లాస్స్ పోలింగ్ రోజు మర్నాడు కి కలిపి 5 రోజుల రెమ్యునరేషన్ ని ఇచ్చామని కలెక్టర్ తెలుపుతూ ఉద్యోగ, ఉపాద్యాయులు పోలింగ్ సిబ్బంది చాలా బాగా పని చేశారని అన్నారు.రాత్రి అయ్యేవరకు పోలింగ్ జరిగినా ఉద్యోగులు కష్ట పడి పనిచేశారని వారందరికీ జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. త్వరలోనే బాధ్యతాయుతంగా పనిచేసిన మిగతా ఉద్యోగస్తులను సత్కరించటం జరుగుతుందని కలెక్టర్ నాయకులకు తెలిపారు.ఈ సందర్భంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారు పోలింగ్ స్టేషన్స్ వద్ద అత్యవసర మెడికల్ సదుపాయాలు తో అందుబాటులో ఉండి పనిచేశారని,వారికి కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరిన పిమ్మట ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి వారికి కూడా వచ్చేలా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగినిలు బాగా పనిచేశారని కలెక్టర్ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు తాలూకా అధ్యక్షుడు జి శ్రీధర్, కార్యదర్శి కె. సత్యనారాయణ, జిల్లా ఎన్జీవోస్ నాయకులు నోరి శ్రీనివాస్, నారాయణ నాయుడు,నరేంద్ర, పూడి శ్రీనివాస్,గంగాధర్, హరినారాయణ,మహిళా విభాగం సభ్యులు సత్య భారతి,మల్లిక,నాగమణి, జగదీశ్వరి,క్లాస్ 4 సంఘం నాయకులు వై.శ్రీనివాస్, ఎస్. శివ తదితరులు పాల్గొన్నారు.