బాధ్యతలు చేపట్టిన సిఐని కలిసిన ప్రజా సంఘాల నాయకులు
1 min readశ్రీనివాసులుని కలిసి ప్రజా సమస్యల ను తెలియజేసిన విద్యార్థి,యువజన,ప్రజా సంఘాల నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణ సీఐ గా విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ రెడ్డి బదిలీ కావడంతో అతని స్థానంలో బాధ్యతలు చేపట్టిన సీఐ వి. శ్రీనివాసులును కలిసిన ప్రజా సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రంగస్వామి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షులు, చార్లెస్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎం.నరసప్ప, డివైఎఫ్ఐ పట్టణ నాయకులు అజిత్ ల ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణ సిఐ మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే ధైర్యంగా వచ్చి చెప్పుకోండని మీకు తెలిసిన సమాచారం ఉంటే మాకు తెలియజేయండి వివరాలు గోప్యంగా ఉంచుతామని శాంతిభద్రతల విషయంలో నిరంతరం పోలీస్ టికెట్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అనుకూలంగా ముందుకు పోతామని తెలియజేశారు. అలాగే నాయకులు మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసిన సిఐ సుదర్శన్ రెడ్డి మూడు నెలలు పట్టణంలో శాంతిభద్రతలను కాపాడి అల్లరి మూకలను,అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపారని అంతకు మించి కొత్తగా వచ్చిన మీరు కూడా పట్టణంలో గుట్కా,గంజాయి జూదం ,అసాంఘిక కార్యకలాపాలపై,మరియు రౌడీ బ్యాచ్ లపై దృష్టి సారించి ఇటువంటి వారిని కూకటివేల్లతో పెకిలించి ఎమ్మిగనూరు పట్టణంలో శాంతి భద్రతలను కాపాడి తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను బేదభావం లేకుండా పరష్కరించాలని ఈ సందర్భంగా సిఐకు విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు తెలియజేశారు. అలాగే కళాశాలల, పాఠశాలల ఆటస్థలాలలో ,బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగకుండా కట్టడి చేయాలని పేర్కొన్నారు మరియు అధిక డీ జే శబ్దాలతో పలు కార్యక్రమాల పేరు తో ఊరేగింపులు చేస్తూ శబ్ద కాలుష్యం తో ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్షులు ఎర్రకోట అరుణ్, మల్లెల హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.