PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల నాయకత్వాన్ని, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి

1 min read

ప్రతిభకు అంగ వైకల్యం అడ్డు కాదు

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల నాయకత్వాన్ని, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని  జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో 65వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  1992 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ (యుఎన్ఓ) తీర్మానం మేరకు  ప్రతి సంవత్సరం డిసెంబర్ 3 వ తేదిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు..ఈ ఏడాది  “సమగ్రమైన స్థిరమైన భవిష్యత్తు కోసం వైకల్యాలున్న వ్యక్తుల నాయకత్వాన్ని విస్తరించడం”  అన్న థీమ్ తో ఈ వేడుకలు జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.. ప్రతిభను అంగవైకల్యం అడ్డుకోలేదని కలెక్టర్ తెలిపారు .  ఈ విషయాన్ని ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు నిరూపించారన్నారు.. హెలెన్ కెల్లర్, స్టీఫెన్ హాకింగ్ అన్నారు. స్టీఫెన్ హాకింగ్ శరీర భాగాలు చాలా వరకు పని చేయవని, పూర్తిగా కుర్చీకి పరిమితమై ఉంటారన్నారు.. ప్రపంచంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించి  స్టీఫెన్ హాకింగ్   పరిశోధనలు ఇప్పటికీ చాలా మందికి గైడ్ గా ఉందన్నారు.. భారత దేశంలో సుధా చంద్రన్  కూడా ఎంతోమందికి స్పూర్తినిస్తున్నారని తెలిపారు.. అలాగే ఒలింపిక్స్ లో పాల్గొని ఎంతోమంది గోల్డ్, సిల్వర్ పథకాలను సాధించారని అటువంటి వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల నాయకత్వాన్ని బలపరచి సమాజ అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ అన్ని జన్మలలో ఉత్తమ జన్మ మానవ జన్మ అని అన్నారు.  2016 సంవత్సరంలో  21 డిజేబులిటీస్  ఉన్న వారికి విద్య, ఉద్యోగం తదితర అంశాలపై హక్కులు కల్పిస్తూ చట్టం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు..చట్టాలను వినియోగించుకుని వారి హక్కులను పొందాలని సూచించారు.. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెలలో విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాలను సందర్శించి జిల్లా కలెక్టర్ సహకారంతో వారికి అవసరమైన మౌలిక, వైద్య సదుపాయాల కల్పన కు కృషి చేస్తామన్నారు… జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ ఆవరణంలో శాశ్వత లోక్ అదాలత్ కార్యాలయం కూడా  ఉందని, పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్  లో లోపాలపై తమకు ఫిర్యాదులు చేస్తే, ఉచితంగా న్యాయ సేవలను అందిస్తామని తెలిపారు..  ఏ సమస్య ఉన్నా లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 ఫిర్యాదు చేస్తే  ఉచితంగా న్యాయ సేవలు అందజేయడం జరుగుతుందని వివరించారు.విభిన్న ప్రతిభావంతుల్లో ఉత్తమ సేవలు అందజేసిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శాలువా తో సత్కరించారు.అనంతరం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారిని జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బహుమతులు ప్రధానం చేశారు.అంతకుముందు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమం చివరిలో  కలెక్టర్ గారితో ఎం.ఈరన్న, జి.వెంకట స్వామి అనే విభిన్న ప్రతిభావంతులు సెల్ఫీ దిగారు.కార్యక్రమంలో సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, మున్సిపల్ కమీషనర్ రవీంద్ర బాబు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి రయీస్ ఫాతిమా, డిఆర్డిఎ ఇంఛార్జి పిడి నాగ శివలీల, డిఎస్ఓ రాజా రఘువీర్, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *