PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెడు అలవాట్లను భోగి మంటల్లో వదలండి…

1 min read

ఆరోగ్యాన్ని కాపాడుకోండి…

  • ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​
  • కర్నూలు హార్ట్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో భోగి సంబరాలు

కర్నూలు, పల్లెవెలుగు:  రైతుల ఇంట సిరిసంపదలు తీసుకొచ్చే సంక్రాంతి పండగను మూడు రోజులపాటు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారని, మొదటి రోజు జరుపును భోగి మంటల్లో చెడు అలవాట్లను వదిలేయాలని సూచించారు ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​. సోమవారం భోగభాగ్యాల భోగిని పురస్కరించుకుని కర్నూలు హార్ట్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో భోగి పండగ సంబరాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి , ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​​ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా భోగి పండగను జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇంట్లోని పాత వస్తువులను భోగి మంటల్లో వేసినట్లే….చెడు అలవాట్లను కూడా భోగి మంటల్లో వదిలేయాలని, అప్పుడే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు.  కొత్త జీవితానికి శ్రీకారం చుట్టినప్పుడు భవిష్యత్​ ఆనందమయంగా ఉంటుందన్నారు.  సంక్రాంతి పండగను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు  చంద్రశేఖర్​ కల్కూర, ట్రెజరర్​ రాముడు, సభ్యులు డా.హేమంత్​ కుమార్, లక్ష్మణ్​ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *