వైసీపీని వీడి టిడిపిలో చేరిక..
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం: కౌతాళం మండలం కుంబళనూరు గ్రామ సర్పంచ్ వీరేష్,యం పి టి సి సభ్యులు ముత్తన్న, రేషన్ డీలర్ ఈరన్న గౌడ్,50 మంది తెలుగుదేశం పార్టీ లో చేరికతెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి.. మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం కుంబళనూరు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ వీరేష్,యం పి టి సి సభ్యులు ముత్తన్న, రేషన్ డీలర్ ఈరన్న గౌడ్ తో పాటు 50 మంది వైసిపి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి చేరినారు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కౌతాళం మండలం జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప , అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ లోకి చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేస్తూన్న మంచి పనులు కోసమే మేం తెలుగుదేశం పార్టీ లోకి చేరినాము. అని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.