మహిళా ఉపాధ్యాయిని కళ్యాణి కుమారిని ఘనంగా సత్కరించిన శాసనసభ్యులు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జే యం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయిని కళ్యాణి కుమారిని పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ శుక్రవారం జేయం. తండా పాఠశాలలో ఘనంగా సత్కరించారు. సంఘసంస్కర్త, మహిళా చైతన్య మూర్తి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాఠశాలలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తమ పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ కి విద్యార్థులు పాఠశాలలోకి స్వాగతం పలికారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చాలా గొప్పవని ఎమ్మెల్యే అన్నారు. సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని జె యం తాండ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కళ్యాణి మేడం కృషి చాలా గొప్పదని అన్నారు. కళ్యాణి మేడం జె యం తండా పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల నుండి 40 మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా కృషిచేసిన కళ్యాణి మేడంను ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ ఈ సందర్భంగా అభినందించారు. ఉపాధ్యాయ లోకం కళ్యాణి మేడంను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు మంచి విద్యాబోధన అందిస్తే పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపు చూడకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతారని స్పష్టం చేశారు. అనంతరం జె యం పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయులు నాగభూషణం, విద్యార్థిని, విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.