అమరుల త్యాగాల స్ఫూర్తితో విద్య ఉపాధికై ఉద్యమిద్దాం – ఎస్ఎఫ్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న విద్యార్థి ఉద్యమ వేగు చుక్క భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని ఇంగలదహల్ బాలుర వసతి గృహం నందు ఎస్ఎఫ్ఐ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షులు పంపాపతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి, భగత్సింగ్ వారసత్వంతో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఎ) అధ్యయనం, పోరాటం నినాదంతో 1970లో ఏర్పడింది. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలకై అలుపెరుగని పోరాట పయనంలో 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందరికీ నాణ్యమైన విద్య ఉపాధి అందాలని కోరుతున్నది. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడుస్తున్న విద్య అందని ద్రాక్షాగా మారింది. ప్రస్తుతం సమాజంలో ఎన్ని అసమానతలు అంతరాలు ఉన్నాయో అన్నింటిని నేటి విద్యారంగం కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. విద్యపై ప్రభుత్వాలు తమ భాద్యతను మరిచి కార్పోరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ప్రభుత్వ విద్యపై సవతి తల్లి ప్రేమను కురిపిస్తున్నారు. విద్యాదాతల ఆశయాలకు ప్రతిరూపాలైన ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటుపరానికి ఉసిగోల్పారు. వాటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దశలవారీ పోరాటాలను నిర్వహించాం. వసతి గృహాల విద్యార్ధుల సమ్యలపై కృషి చేస్తున్నది.హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్ మెస్ చార్జీల కోసం హాస్టల్ విద్యార్థుల అదనపు భవనాల నిర్మాణం కోసం అదేవిధంగా జాతీయ విద్యా విధానంతో జరుగుతున్న విద్యా వ్యాపారం, చరిత్ర ధ్వసం, కేంద్ర ఆధిపత్యంపై నిలదీస్తున్నది. పోరాటాలతో పాటు సేవా కార్యక్రమాల్లో ముందుండి పని చేస్తున్నది. కరోనా విపత్తు సమయంలో ముందుండి సేవాలందిచారు. విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్ కి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పంపాపతి పాఠశాల అధ్యక్షులు మంజునాథ్ కమిటీ సభ్యులు మల్లి, పరమేష్,రెహ్మాన్,బాలజీ విద్యార్థులు పాల్గొన్నారు.