PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠశాలల బలోపేతానికి ప్రతిఒక్కరం కృషి చేద్దాం

1 min read

పాఠశాల విద్యా కమిషనర్ వి. విజయ రామరాజు ఐఏఎస్​

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పాఠశాల కేంద్రంగా అమలవుతున్న విద్యావిధానాలు క్షేత్రా స్థాయిలో ఆచరణాత్మకంగా సత్ఫలితాలు సాధించాలని, పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పాఠశాల విద్య సంచాలకులు మరియు కమీషనర్ వి.విజయరామరాజు అన్నారు. శుక్రవారం ఉదయం కర్నూలు నగరంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కర్నూలు ఉమ్మడి( కర్నూలు- నంద్యాల) జిల్లాల్లోని పాఠశాలలను బలోపేతం చేయడం, జీవో నెంబర్ 117 ఉపసంహరణ అనంతపరిణామాలు, ప్రత్యామ్నాయ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించినందున పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు.  ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,  ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు మరియు అధికారులు,  జెడ్పీ సీఈవోలు  హాజరయ్యారు.  జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో డీఈఓ శ్యామ్యూల్ పాల్  ఉమ్మడి జిల్లాల డివిజనల్ ఉపవిద్యాధికారులు,  నియోజకవర్గ అధికారులు, మండల విద్యాధికారులు 1&2, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. సుమారు గా  395 మంది హాజరు అయినారు .పాఠశాలలు బలోపేతము  చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది జిల్లాల పరిణామాలు తద్వారా ప్రాథమిక, సెకండరీ విద్యలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ విధానాలపై   చర్చించారు. వారి నుండి పలు సూచనలు తీసుకున్నారు. అసలు విద్య వ్యవస్థ ఎక్కడ కుంటు పడింది అనే దగ్గర నుండి ఎలా బాగు పరచాల అనే వరకు చర్చించినారు . అసలు ఆన్లైన్ లో ఉన్న డేటా , ఫిసికల్ గ ఉన్న డేటా ను constuency ఆఫీసర్స్ మరియు ఎంఈఓస్​ వెరిఫై చేసి జిల్లా విద్య శాఖా అధికారి ద్వారా కలెక్టరు  ద్వారా కమీషనర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి పంపించాలి .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *