అల్లూరి సీతారామరాజు శత వర్థంతి ని సమున్నతంగా పాటిద్దాం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాజీలేని స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతిని సమున్నతంగా పాటిద్దాం! (7-5-2024 నుండి 7-5-2025 వరకు)రాజీలేని భారత స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఆయన మరణించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా శత వర్ధంతిని పురస్కరించుకొని కర్నూలు నగరంలో సంవత్సరం పొడవునా అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తిని విద్యార్థుల్లో యువతీ యువకుల్లో పెంపొందించుటకై అనేక కార్యక్రమాలు నిర్వహించుటకై టీజీవి కళాక్షేత్రం మినీ హాల్ నందు అల్లూరి వార్షిక శత వర్ధంతి కమిటీని ఏర్పాటు చేయడమైనది. ఈ కమిటీ గౌరవాధ్యక్షులుగా టీజీవి కళాక్షేత్ర అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య , అధ్యక్షులుగా రిటైర్డ్ హెడ్మాస్టర్ రామశేషయ్య , ఉపాధ్యక్షులుగా సీనియర్ న్యాయవాదులు ఓంకార్ గారు, CRRMM హై స్కూల్ హెడ్మాస్టర్ వెంకట్ రెడ్డి , గవర్నమెంట్ డైట్ కాలేజీ ప్రిన్సిపల్ వసుంధర దేవి , కార్యదర్శిగా తేజోవతి, కోశాధికారి విశ్వనాథరెడ్డి మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అడ్వకేట్స్, యువకులు, విద్యార్థులతో కూడిన 19 మంది సభ్యులతో అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి వార్షిక నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయడమైనది.ఈ కమిటీ అధ్యక్షులు రామశేషయ్య మాట్లాడుతూ అత్యంత చిన్న వయసులోనే బ్రిటిష్ నిరంకుశ పాలనను ఎదిరిస్తూ తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలలో స్వాతంత్య్రోద్యమ కాంక్షను రగిలించి వారిని ఉద్యమ బాటలో నడిపించినటువంటి రాజీలేని పోరాట యోధుడు. అటువంటి మహనీయుల యొక్క చరిత్రను భావితరాల వారికి తెలియజేయాలి అప్పుడే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు అన్నారు. ఉపాధ్యక్షులు ఓంకార్ గారు మాట్లాడుతూ నేటి విద్యా వ్యవస్థ ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి చెప్పడం లేదని కేవలం మార్కులు ర్యాంకులు ఉద్యోగాలు సంపాదించడం డబ్బులు సంపాదించడం వంటి వాటిని పిల్లలకి బోధిస్తున్నారు. దీనితో వారికి ఒక ఆదర్శ అంటూ లేకపోయింది పెడదారి పడుతున్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి వారి చరిత్ర గురించి తెలియజేసి నేటి విద్యార్థులలో యువతీ యువకులలో ఓర్పు సహనం దయ క్షమా గుణం స్నేహ తత్వం సున్నితత్వం వంటి మౌలికమైన లక్షణాలను పెంపొందించడం మూలంగా వారు సమాజంలో మంచి వ్యక్తులుగా అభివృద్ధి చెందుతారని ఇది మనం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం అని అన్నారు. దాని కొరకై మా శత వర్ధంతి కమిటీ 2025 మే 7వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు కర్నూలు నగరంలో నిర్వహించబోతుందని తెలియజేశారు. ఉపాధ్యక్షఁలు టి. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 26 మందితో కూడినటువంటి అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి వార్షిక నిర్వహణ కమిటీ, కర్నూలు నగరంలోని స్కూల్స్ కాలేజీలు ఇతర ప్రాంతాలలో కూడా అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకుపోతుందని ఈ కమిటీలో ఉన్నటువంటి టీచర్లు లెక్చరర్లు విద్యార్థులు సామాజిక కార్యకర్తలు అందరూ కూడా ఈ బాధ్యతని నిర్వహిస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చరిత్రకారులు ఇమ్మానియేల్, విశ్వనాథ్ రెడ్డి, శక్రప్ప, రోజా, హరీష్ కుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.