సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి
1 min readమంత్రాలయం సిఐ రామాంజులు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మండల పరిధిలోని గ్రామాల్లో ప్రజలు సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని మంత్రాలయం సిఐ రామాంజులు సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి పండగ పేరుతో కోడిపందెలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠీన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని సూచించారు. గతంలో సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందేలు, జుదాలకు పాల్పడిన వారిపై గట్టి నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు. కోడి పందేలు, జుదాలు, పేకాట వంటి వాటిని ఆడిన, ఆడించిన వారిపై కేసులు నమోదు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు రాకుండా దేశాలకు వెళ్లకుండా పాస్ పోర్ట్ మంజూరు చేయకుండా నిషేధించడం జరుగుతుందన్నారు. పల్లెలో అక్రమముగా మద్యం , బెల్టు షాపులు నిర్వహించడం, నాటు సార తయారు చేయడం అమ్మకాలు చేసే వారిపై గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు. ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే వారిపై రౌడీ షీట్లు తెరిచి పీ. డీ యాక్ట్ ప్రకారం కఠీన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పల్లెలో పండుగ సమయలో, ప్రశాంత వాతావరణణి భంగం కలింగించి, ఘర్షణలకు పాల్పడితే వారిపై రౌడీ షీట్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. పండుగ సమయలో వేరే ఊర్లకు వెళ్లే వారికీ సంబందించిన విలువైన వస్తువులు, నగలు, డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. వేరే ఊర్లకు వెళ్లే వారు దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ లో వివరాలు అందించాలని కోరారు. దీని వల్ల ఇళ్ళ పై, రాత్రి గస్తి తిరిగే పోలీసులు ఎలాంటి దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు. సొంత వాహనాలో వేరే ఊర్లకు ప్రయాణించే వారు తగిన జాగ్రత్తలు తీసుకొని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సై పరమేష్ నాయక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.