సౌరశక్తిని సద్వినియోగం తెలుసుకుందాం…ఆదా చేసుకుందాం
1 min readదెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పెదవేగి మండలం దుగ్గిరాలలో పీఎం సూర్య ఘర్ యోజన పథకంపై గ్రామస్తులకు అవగాహన సదస్సు
ముఖ్యఅతిథిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది,కూటమి నాయకులు,గ్రామస్తులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: రోజు రోజుకి అంతరించి పోతున్న ఇంధన వనరులకు ప్రత్యామ్నాయం చేస్తూ భావితరాలకు మెరుగైన సహజ వనరులను, కాలుష్య రహిత సమాజాన్ని అందించటంలో ప్రతి ఒక్కరూ సామాజిక భాద్యతగా భావించి చొరవ చూపాలని, సౌరశక్తిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అందుకు పిఎం సూర్య ఘర్ యోజన పథకం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగంగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.దుగ్గిరాల గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అవగాహన సదస్సులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌర శక్తిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా కలిగే లాభాలను, పీఎం సూర్య గర్ పథకం ద్వారా లభించే సబ్సిడీ, లోన్ తదితర లబ్దిని విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్తులకు వివరించారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో పీఎం సూర్య గర్ యోజన పథకాన్ని అమలు చేయడానికి మొదటగా దుగ్గిరాల గ్రామపంచాయతీని మోడల్ విలేజ్ గా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో దుగ్గిరాల గ్రామాన్ని నూరు శాతం సౌరశక్తిని వినియోగించుకునే గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అదేవిధంగా వినియోగదారులకు అమర్చే సౌర పలకలను వాటికి సంబంధించిన విభాగాలను పూర్తి సమర్ధతతో కలిగిన పరికరాలను వినియోగించేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మరమ్మత్తుల విషయంలో కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక సిబ్బంది గ్రామస్తులకి అందుబాటులో ఉండే విధంగా కూడా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. గ్రామంలో నూరు శాతం సౌర విద్యుద్దీకరణ జరగడం ద్వారా దుగ్గిరాల గ్రామపంచాయతీకి కేంద్ర ప్రభుత్వం నుంచి కోటి రూపాయల ప్రోత్సాహక నగదు లభిస్తుందని తద్వారా గ్రామపంచాయతీని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామస్తులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ పి .సాల్మన్ రాజు,డిఈ కె.ఏం.అంబేద్కర్, పెదవేగి ఏడిఈకృష్ణరాజు, ఇన్చార్జి ఏఇ రాంబాబు,ఎండిఓ శ్రీనివాస్, ఎమ్మార్వో భ్రమరాంబా, గ్రామ సర్పంచ్ గుంజా క్రీస్తుమని, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధ, బ్యాంకు అధికారి హనుమంత్ రాజు సహా పలువురు కూటమి నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.