పిల్లల ఉజ్వల భవిష్యత్తు ను తీర్చి దిద్దుదాం
1 min readహెచ్. యం.భ్రమరాంబ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుదామని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ అన్నారు. గురువారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ, ప్రతి పాఠశాల పిల్లల ఉజ్వల భవిష్యత్తు ను తీర్చి దిద్దాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుల పైన ఉన్నదన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు అన్న నానుడిని నిజం చేయాలని కోరారు.నాణ్యమైన విద్య, పోషకాహారం,ఆరోగ్యం అందించినప్పుడే వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారుబాటలు వేసిన వాళ్ళం అవుతాం అని తెలిపారు.బాలబాలికల సంపూర్ణ వికాసానికి మన వంతుగా కృషి చేద్దాం అని చెప్పారు.ఈ కార్యక్రమంలో పిల్లలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.వివిధ రకాలైన వ్యాస రచన పోటీలు,క్రీడలలో విజేతలకు బహుమతులను అందజేశారు.ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.