PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళితులపై దాడులను ప్రేరేపించే మనువాద ఫాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

1 min read

సిపిఐ(ఎంఎల్) న్యూడేమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున పిలుపు..

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : దేశంలో దళితులు, ఆదివాసీలు, గిరిజనుల వంటి అట్టడుగు శ్రామిక వర్గాలపై దాడులను ప్రేరేపించే మనువాద ఫాసిజానికి వ్యతిరేఖంగా సంఘటితంగా ఉద్యమించాలని సిపిఐ( ఎంఎల్) న్యూడేమోక్రసి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున పిలుపునిచ్చారు. మంగళవారం హొళగుంద మండల కేంద్రంలో  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కారంచేడు,  చుండూరు మారణ కాండలలో అమరులైన మృతవీరుల స్మారక సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ – కారంచేడు, చుండూరు ఘటనల్లో అగ్రవర్ణాల  పాశవిక దాడుల్లో దళితులు అసువులు బాసారన్నారు. కారంచేడు, చుండూరు నరమేధాల అనంతరం దళిత చైతన్యం పెరిగిందన్నారు. ఆస్తిత్వ ఉద్యమాలు ముందుకొచ్చాయన్నారు. సామాజిక న్యాయ పోరాటాల నుండి ఆవిర్భవించిన చట్టాలను, సంక్షేమ పధకాలను కాపాడుకునేందుకు పోరాడాలని అయన పిలుపునిచ్చారు. నేటి బీజేపీ ప్రభుత్వ హయాంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలపై హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. మనువాద కార్పొరేట్ ఫాసిస్టు భావజాలంతో శ్రామిక వర్గాలపై కుల, మతోన్మాద దాడులు మరింత పెరిగాయని దుయ్యబట్టారు. మత మైనార్టీలపై అరెస్సెస్, బీజేపీ దాడులు నిరంతరం పెరిగాయని విమర్శించారు. మోడీ – షా లు మతం పేరిట విద్వేషాలు, దాడుల్ని మరింత ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కుల, మతోన్మాదాలకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో భాగస్వాములవ్వాలని కోరారు. ఈ సదస్సులో పీ ఓ డబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. పద్మ మాట్లాడుతూ హక్కులను రక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, చివరకు పత్రికా సమాజం కూడా దళితుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నాయని, ఇటీవల  గిరిజన మహిళా ఉద్యోగి శాంతి వ్యక్తిగా జీవితంలోకి తొంగిచూసిన వైనం సభ్య సమాజానికి సిగ్గుచేటని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంకప్ప శంకర్ సౌరప్ప బసప్ప దేవన్న పి డి ఎస్ యు తాలూకా కార్యదర్శి మునిస్వామి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author