బైపాస్ రోడ్డు బాధితులకు నష్టపరిహారం చెల్లించి.. బైపాస్ నిర్మించుకుందాం
1 min readపార్థసారధి ఎమ్మెల్యే ఆదోని
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోనిలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన బాధితులకు నష్టపరహారం చెల్లించి అందరి సహాయ సహకారాలతో ఆదోని బైపాస్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుందామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అధ్యక్షతన జరిగిన NH బైపాస్ బాధితులు మరియు ఆదోని పుర ప్రముఖ్ లతో జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పాల్గొని మాట్లాడారు.అందులో బైపాస్ వెళ్ళే రోడ్డు స్థలానికి సంబంధించిన బాధితులు అధికారులతో మరియు ఎమ్మెల్యే తో తమకు వస్తున్నటువంటి అనేక సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. బైపాస్ ఏర్పాటయితే బాధితులకు కలిగై ఆర్థిక నష్టాలు ,ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి సమస్యలను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించి ఎమ్మెల్యే మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడి ఇప్పుడు ఇచ్చేటువంటి నష్టపరిహారంతో కలుపుకుని ఇంకా కొంత దానికి జోడించి మరికొంత ఆర్థిక సాయం చేసి బాధితులకు ఎటువంటి నష్టం జరగకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఒకటి రెండు ఇంకా ఏమైనా ఇబ్బందులు వచ్చినా నేరుగా నన్ను వచ్చి కలిస్తే నేను కాని నా ద్వారా గాని మీకు కావలసినటువంటి సాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యేఅన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ , Mro గారు , NH రోడ్ అధికారులు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.