PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాగును ప్రోత్సహిద్దాం..

1 min read

రైతులను కాపాడుకుందాం..

  • కేంద్రం నిధులతోనే రైతు భరోసా కేంద్రాలు…
  • ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు: దేశం బాగుండాలంటే… ముందు సాగును ప్రోత్సహించి… రైతులను కాపాడుకోవాలని, ఆదిశగా దేశ ప్రధాని నరేంద్రమోదీ అడుగులు వేస్తున్నారన్నారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. ఆదోని నియోజకవర్గంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. గురవారం మండలంలోని ఇస్వీ, గణేకల్లు గ్రామాల్లో కూటమి నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టారని, కానీ ఎక్కడా దేశ ప్రధాని పేరు చెప్పకుండా… రాష్ట్ర ప్రభుత్వమే కట్టించినట్లు సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి ఇన్ని చెప్పి.. రైతులను మోసం చేశాడని ఆరోపించారు. కేంద్రాలలో మంచి విత్తనాల గురించి చెప్పకపోవడం…నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన వారి గురించి పట్టించుకోకపోవడం… కనీసం పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర  కల్పించడంలో జగన్​ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఊరు బాగుండాలంటే… ఎమ్మెల్యే మారాలి అని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే… భస్మారుడికి వేసినట్లేనని ఎద్దేవ చేశారు. మీరు వేసిన ఓట్లతో గెలిచి…మిమ్మల్ని ముప్పుతిప్పలు పెడుతున్న ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డిని తిప్పి పంపాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిస్తే గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా డా. పార్థసారధి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author