రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నాయకత్వ పెంపుపై నంద్యాల కర్నూలు జిల్లాల మండల విద్యాధికారులకు ఉన్నత పాఠశాలల ప్రధా నోపాధ్యాయులకు ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం మూడవ బ్యాచ్ రాఘవేంద్ర బిఈడి కళాశాల నన్నూరు టోల్గేట్ నంద్యాల రోడ్డు శిక్షణ కార్యక్రమంలో గౌరవ విద్యాశాఖ అధికారి శ్రీ శామ్యూల్ పాల్ 75 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని 1949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు.రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగమేనని, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందని 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, 75 వ భారత రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అన్నారు. స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతత్వం రాజ్యాంగం వల్లే సాధ్యమైంది అన్నారు శిక్షణలో పాల్గొన్న ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల విద్యాధికారులను ఉద్దేశించి మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వ దేశమని అన్ని కులాలు అన్ని మతాలవారు సమానంగా జీవిస్తున్నారని మత ప్రమేయం లేని రాజ్యమే మన భారతదేశం అని మన రాజ్యాంగాన్ని చాలా దేశాలు ఆదర్శంగా తీసుకున్నయని మన భారతదేశ ముద్దుబిడ్డ మన అంబేద్కర్ అయినందుకు ప్రతి భారతదేశ పౌరుడు గర్వపడాలని అన్నారు అనంతరం శిక్షణ తరగతులను సందర్శించి శిక్షణను సక్రమంగా సద్వినియోగం చేసుకొన వలెనని చెప్పడం జరిగింది, ఈ శిక్షణ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సహాయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ షేక్ రఫీ, నంద్యాల జిల్లా సహాయ పర్యవేక్షణ అధికారి యూనస్ భాష, 210 ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులు , మాస్టర్ ఫెసిలిటేటర్స్ పాల్గొన్నారు.