PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాంజల చెరువును కాపాడుకుందాం… ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  రామజల చెరువును ఆదోని ప్రజలంతా కలిసి కాపాడుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పిలుపునిచ్చారు.గురువారం రాంజల చెరువును అధికారులతో కలసి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకో నాలుగు రోజుల్లో విషపు నీరంతా బయటికి వెళ్లిపోతాయని, తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ పదార్థాలు, పిచ్చి మొక్కలు అన్నిటినీ తీసివేసి, ఎల్ .ఎల్ .సి కెనాల్ లో టీబీ డ్యాం ద్వారా వచ్చిన నీటిని, మరియు వర్షపు ద్వారా వచ్చినటువంటి నీటిని మన రంజాలలో నిలువ చేయడం జరుగుతుందని ,వాటిని కూడా ఫిల్టర్ చేసి ప్రజలకు పరిశుద్ధమైనటువంటి నీటిని అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.ఎన్నో సంవత్సరాలుగా  రాంజల లో చెత్తాచెదారం ఉండిపోయిందని, దానిని బయట తీయడానికి అధికారుల కృషి చాలా ఉందని ఎమ్మెల్యే అన్నారు.  ఏదేమైనాప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ మరి కొన్ని రోజుల్లో రాంజల నుండి ఆధోనికి మంచినీటిని వదిలే సదుపాయం కలుగుతుందని అన్నారు.ఆదోని ప్రజలకు ఇకనుండి రాంజల గట్టు దగ్గర పూజల పేరుతో వేసే చెత్తను , వెనక సైడ్ ఉన్నటువంటి మసీదు నుండీ వేసే చెత్తను రాంజల లో  వేయకూడదనిఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఎందుకంటే ఆ చెత్తాచెదారం వేయడం కారణంగా మంచినీరంతా కూడా అపరిశుభ్రంగా మారుతాయి కాబట్టి, వాటినే మనం తాగవలసి వస్తుంది కాబట్టి ఇదంతా బాగుండదని, అందరూ కూడా ఇకనుండి రాంజల లోఎటువంటి చెత్తచెదారం  వేయకుండా ఉండాలని ఆదోని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో M.e చలపతి తదితరులు పాల్గొన్నారు.

About Author