వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం…
1 min readరైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టం తీసుకురావాలి…
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి. రామచంద్రయ్య
నూతనంగా ఎన్నికైన ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రామచంద్రయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక చదువుల రామయ్య భవనంలో ఏపీ రైతు సంఘం నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు పెద్ద ఈరన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు పూనుకుంటున్నాయని విమర్శించారు. దేశానికి అన్న వస్త్రాలను అందించే అన్నదాత రైతుల ఆత్మహత్యలను నివారించాలన్నారు.పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేల రూపాయలు తక్షణమే రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్లో పంటలు సాగు చేసుకునేందుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దామని అన్నారు. నియోజకవర్గ అధ్యక్షులు పెద్ద ఈరన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య, నియోజకవర్గ కార్యదర్శి ఉమాపతి పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘంనూతన కమిటీ ఎన్నిక:-ఏపీ రైతు సంఘం నియోజకవర్గ నూతన కమిటీని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి. రాజా సాహెబ్ ప్రకటించారు. నియోజకవర్గ అధ్యక్షులుగా ఉమాపతి, ఉపాధ్యక్షులుగా రామనాయుడు, నాగిరెడ్డి, పెద్ద ముని,తదితరులు పాల్గొన్నారు.