ఇంధన పొదుపు ద్వారా భవిష్యత్తును రక్షించుకొందాం.. ఎమ్మెల్యే
1 min readచందనాన్ని పొదుపు చేసుకుంటూ మన భావితరాల భవిష్యత్తును రక్షించుకుందామని ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ ఆదోని: గురువారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఆదోని మున్సిపల్ కార్యాలయం నుండి అవగహన ర్యాలీనీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరెంట్ ను అదాచేసుకుంటూ రెంటు బిల్లును తగ్గించుకునే ఎటువంటి అవకాశాన్ని ప్రతి వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని, రెంట్ బిల్లు తగ్గించుకోవడం ప్రతి కుటుంబానికి అవసరమని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కొరకే ఈరోజు ఈ ర్యాలీ చేపడుతున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఆరుసార్లు కరెంట్ బిల్లు పెంచితే, మాకూటమి ప్రభుత్వంలో మాత్రం కరెంట్ బిల్లును ఏ విధంగా ఆదా చేసుకోవాలని అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. సౌర విద్యుత్తును వినియోగించుకుంటే మనం పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించిన వారమవుతామని అన్నారు.ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్సిడీ సంబంధించినటువంటి సౌర విద్యుత్తును వినియోగించుకోవాలని ప్రజలందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.